నేను నా ట్రిప్ ఆదాయాలను ఎక్కడ చూడగలను?

మీ స్క్రీన్‌కు ఎగువన ఛార్జీ ఐకాన్‌ లేదా ఆదాయాల ట్యాబ్‌ను తట్టడం ద్వారా మీ డ్రైవర్ యాప్‌లో వారం, రోజు లేదా ట్రిప్ వంటి వాటి ద్వారా మీ ఆదాయాలను ట్రాక్ చేసుకోవచ్చు: ఆదాయాల ట్యాబ్‌ను చూసేందుకు: 1. ఎగువ ఎడమ మూలలో ఉన్నమెనూ బటన్ (మూడు లైన్ల)ను తట్టండి. 2. ఎగువ మెనూ నుండి "ఆదాయాల"ను ఎంచుకోండి. ప్రస్తుత వారానికి సంబంధించిన మీ పూర్తి ఆదాయాలు ట్యాబ్‌కు ఎగువన ప్రదర్శించబడతాయి. వారపు ఆదాయాలు, ఖర్చులు మరియు క్యాష్ అవుట్ వంటి వాటికి సంబంధించిన పూర్తి విభజనలను చూడటానికి మీ పూర్తి ఆదాయాల క్రింద కనిపించే గ్రాఫ్‌ను తట్టండి. నిర్దిష్ట రోజు నుండి ట్రిప్ ఛార్జీలకు సంబంధించిన విభజనలను చూడటానికి గ్రాఫ్‌లో ఆ రోజుపై తట్టండి. మునుపటి వారాలకు సంబంధించిన గ్రాఫ్‌ను చూడటానికి ఎడమవైపుకు స్వైప్ చేయండి. ట్రిప్ చరిత్ర ట్యాబ్‌ ఇటీవలి కాలంలో మీరు చేసిన ట్రిప్‌లను ప్రదర్శిస్తుంది. ఒక నిర్దిష్ట ట్రిప్‌ను ఎంచుకోవడం వలన ట్రిప్‌కు సంబంధించిన స్థూల ఛార్జీ మరియు నికర ఛార్జీ కనిపిస్తాయి. చెల్లింపు సారాంశాల ట్యాబ్‌ గత వారాలకు సంబంధించిన మీ వారపు చెల్లింపుల సారాంశాలను ప్రదర్శిస్తుంది. ప్రతి వారపు సారాంశంలో, ఆ వారంలోని నిర్దిష్ట రోజుల రోజువారీ ఆదాయాలను చూసేందుకుగాను మీరు క్రిందికి స్క్రోల్ చేయవచ్చు. నిర్దిష్ట రోజును ఎంచుకోవడం వల్ల ఆ రోజుకు సంబంధించిన ట్రిప్‌లు మరియు ఆ ట్రిప్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీ డ్రైవర్ యాప్‌లో చూపిన మొత్తం మీ డ్యాష్‌బోర్డ్‌లో చూపిన మొత్తంతో జత అవుతుంది. మీ డ్రైవర్ యాప్‌లో కనిపించే ఆదాయాలు Uber సేవా రుసుములు మరియు ఏవైనా వర్తించే ఇతర ఫీజుల వంటివి ఛార్జీ చేయబడిన తర్వాత మీ నికర సంపాదనల అంచనా. మీ యాప్‌లో ప్రదర్శించే నికర ఛార్జీలు మీ తుది స్టేట్‌మెంట్‌లో కనిపించే వాటికి సరిగ్గా జతకాకపోవచ్చు.