అక్టోబర్ 2016లో, Uber ఒక డేటా భద్రత సంఘటనను ఎదుర్కొంది, ఇది రైడర్ మరియు డ్రైవర్ ఖాతాలకు సంబంధించి సమాచార ఉల్లంఘనకు దారితీసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాలకు సంబంధించిన డ్రైవర్ సమాచారంలో పేర్లు, ఇమెయిల్ చిరునామాలు మరియు మొబైల్ ఫోన్ నంబర్లు ఉన్నాయి. అదనంగా, యునైటెడ్ స్టేట్స్‌లోని సుమారు 600,000 మంది డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లు డౌన్‌లోడ్ చేయబడ్డాయి. ట్రిప్ లొకేషన్ చరిత్ర, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, బ్యాంక్ ఖాతా నంబర్‌లు, సోషల్ సెక్యూరిటీ నంబర్‌లు లేదా పుట్టిన తేదీలు డౌన్‌లోడ్ చేయబడిన సూచన ఏదీ మా బాహ్య ఫోరెన్సిక్స్ నిపుణులకు కనబడలేదు.
ఇది జరిగినప్పుడు, డేటాను భద్రపరచడానికి, మరింత అనధికార యాక్సెస్ జరగకుండా నియంత్రించడానికి, అలాగే మా డేటా భద్రతను బలోపేతం చేయడానికి మేము తక్షణ చర్యలు తీసుకున్నాము.
మేము ప్రభావిత డ్రైవర్లకు మెయిల్ లేదా ఇమెయిల్ ద్వారా నేరుగా తెలియజేసి, వారికి ఉచిత క్రెడిట్ పర్యవేక్షణను, గుర్తింపు దొంగతనం జరగకుండా రక్షణను అందిస్తున్నాము.
ఆ సంఘటన గురించి నవంబర్ 2016లో మాకు తెలిసినప్పుడు, హానిని నివారించడానికి మరియు నిరోధించడానికి మేము చర్యలు తీసుకున్నాము, కాని మేము డ్రైవర్లకు తెలియనివ్వలేదు. ఇది తప్పు అని మేము భావిస్తున్నాము, అందుకే మేము ఇప్పుడు వివరించిన చర్యలను తీసుకుంటున్నాము. ఈ సంఘటనతో ముడిపడిన మోసం లేదా దుర్వినియోగం జరిగినట్లు మాకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.