2016 డేటా భద్రత సంఘటన గురించిన సమాచారం

అక్టోబర్ 2016లో, Uber ఒక డేటా భద్రతా ఘటనను ఎదుర్కొంది, దీని ఫలితంగా రైడర్ మరియు డ్రైవర్ ఖాతాలకు సంబంధించిన సమాచార ఉల్లంఘన జరిగింది.

డ్రైవర్ల కొరకు, ఈ సమాచారంలో ప్రపంచవ్యాప్తంగా ఖాతాలకు సంబంధించిన పేర్లు, ఇమెయిల్ చిరునామాలు మరియు మొబైల్ ఫోన్ నెంబర్‌లు సహా ఉన్నాయి. అదనంగా, యునైటెడ్ స్టేట్స్‌లోని సుమారు 600,000 మంది డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్‌లు డౌన్‌లోడ్ చేయబడ్డాయి. ట్రిప్ లొకేషన్ చరిత్ర, క్రెడిట్ కార్డ్ నెంబర్‌లు, బ్యాంక్ ఖాతా నెంబర్‌లు, లేదా పుట్టిన తేదీలు వంటి వివరాలు డౌన్‌లోడ్ అయినట్లు మా బాహ్య ఫోరెన్సిక్స్ నిపుణులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

ఈ ఘటనలో, యునైటెడ్‌ స్టేట్స్‌లోని సుమారు 25.6 మిలియన్‌ల రైడర్‌లు మరియు డ్రైవర్‌ల వివరాలు ఉన్నాయి. ఈ సంఖ్యలు ఖచ్చితమైన, నిశ్చిత గణన కాదు, కేవలం ఒక అంచనా మాత్రమే, ఎందుకంటే కొన్నిసార్లు మేము దేశం కోడ్‌ను కేటాయించడానికి ఉపయోగించే యాప్ లేదా మా వెబ్‌సైట్ ద్వారా పొందే సమాచారం మరియు ఒక వ్యక్తి వాస్తవానికి నివసించే దేశం ఒకటే కావు.

ఇది జరిగినప్పుడు, డేటాను భద్రపరచడానికి, మరింత అనధికార యాక్సెస్ ఆపివేయడానికి, అలాగే మా డేటా భద్రతను బలోపేతం చేయడానికి మేం తక్షణ చర్యలు తీసుకున్నాం.

మేం ప్రభావిత డ్రైవర్లకు మెయిల్ లేదా ఇమెయిల్ ద్వారా నేరుగా తెలియజేసి, వారికి ఉచిత క్రెడిట్ పర్యవేక్షణను, గుర్తింపు చౌర్యం జరగకుండా రక్షణను అందిస్తున్నాం.

ఆ ఘటన గురించి నవంబర్ 2016లో మాకు తెలిసినప్పుడు, హానిని నివారించడానికి, నిరోధించడానికి మేం చర్యలు తీసుకున్నాం, కానీ దీనిని మేం డ్రైవర్లకు తెలియజేయలేదు. ఇది తప్పు అని మేము భావిస్తున్నాం, అందుకే మేము ఇప్పుడు వివరించిన చర్యలను తీసుకుంటున్నాం. ఈ సంఘటనతో ముడిపడి ఉన్న మోసం లేదా దుర్వినియోగం జరిగినట్లు మాకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.

మేము ప్రభావిత డ్రైవర్‌లకు నోటిఫికేషన్‌లను పంపే ప్రక్రియలో ఉన్నాం, అయితే డౌన్‌లోడ్ చేసిన ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్లలో మీ ఖాతా కూడా ఉన్నదీ లేనిదీ, మీరు ఈ కింద తనిఖీ చేసుకోవచ్చు.