రైడర్‌ని సంప్రదించడం

మీరు వారి రైడ్ అభ్యర్థనను ఆమోదించిన తర్వాత, యాప్ ద్వారా వారికి కాల్ లేదా సందేశం పంపడం ద్వారా మీరు మీ రైడర్‌ను సంప్రదించవచ్చు. అంతర్జాతీయ రోమింగ్ రేట్లను నివారించడానికి యాప్‌లో సందేశాన్ని ఉపయోగించమని మేం సిఫార్సు చేస్తున్నాం.

మీ రైడర్‌కు సందేశం పంపడానికి:

  1. యాప్ దిగువన ఉన్న తెల్లటి బార్‌ మీద పైకి స్వైప్ చేయండి.
  2. రైడర్ పేరుకు ఎడమ వైపు ఉన్న చాట్ ఐకాన్‌ను తట్టండి.
  3. మీ సందేశాన్ని టైప్ చేసి, "పంపండి"పై తట్టండి.

మీరు సందేశాన్ని పంపినట్లు మీ రైడర్ నోటిఫికేషన్‌ అందుకుంటాడు. మీ రైడర్ ప్రతిస్పందిస్తే, మీరు కూడా పుష్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు, ఇన్‌కమింగ్ సందేశాన్ని చూస్తారు. సందేశం బిగ్గరగా చదవబడుతుంది, దానిని గుర్తించినందుకు ప్రతిస్పందనగా మీరు "థంబ్స్-అప్"ను పంపే ఆప్షన్ ఉంటుంది.

మా ఇన్-యాప్ ఫీచర్ ద్వారా మెసేజింగ్ అన్ని వేళలా మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ట్రిప్ ముగిసిన తర్వాత మీ రైడర్ మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు.

మీ రైడర్‌కు కాల్ చేయడానికి:

  1. యాప్ దిగువన ఉన్న తెల్లటి బార్‌ మీద పైకి స్వైప్ చేయండి.
  2. రైడర్ పేరుకు ఎడమ వైపున ఉన్న చాట్ ఐకాన్‌ను తట్టండి. మీరు Uber Pool ట్రిప్‌లో ఉన్నట్లయితే, సందేశం లేదా కాల్ చేయడానికి సరైన రైడర్‌ను ఎంచుకున్నట్లుగా నిర్ధారించుకోండి.
  3. ఎగువ కుడివైపున ఉన్న ఫోన్ ఐకాన్‌ను తట్టండి.
  4. రైడర్‌తో కనెక్ట్ అవ్వడానికి కాల్ కోసం వేచి ఉండండి.

అందుబాటులో ఉన్న చోట, ప్రతి ఒక్కరి సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి, యాప్ రైడర్ నెంబర్ మరియు మీ నెంబర్ రెండింటినీ అనామధేయంగా ఉంచుతుంది. ఈ అనామధేయ నెంబర్‌లు ఎల్లప్పుడూ మారుతాయి కాబట్టి, వాటిని స్పీడ్ డయల్ కోసం సేవ్ చేయడం సాధ్యం కాదు.