అనేక-రెస్టారెంట్‌ల నుండి ఒకేసారి అనేక ఆర్డర్‌లు తీసుకువచ్చే ట్రిప్‌లు - తరచుగా అడిగే ప్రశ్నలు

మల్టీ-రెస్టారెంట్‌ బ్యాచ్డ్ ట్రిప్‌లు అంటే ఏమిటి?

ఆర్డర్‌ల కోసం తక్కువ సమయాన్ని వెచ్చించి, ఆహారాన్ని పంపిణీ చేయడం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి మల్టీ-రెస్టారెంట్ బ్యాచ్డ్ ట్రిప్‌లు మీకు సహాయపడతాయి.

బ్యాచ్డ్ ట్రిప్స్ ఎలా పని చేస్తాయి:

  • మీ మొదటి ఆర్డర్ పిక్అప్ సమయంలో, సమీపంలోని రెస్టారెంట్ నుండి మరొక ఆర్డర్ పికప్ చేయాల్సి ఉంటే, మీ తదుపరి ఆర్డర్‌ను అంగీకరించమని మీకు నోటిఫికేషన్ వస్తుంది.
  • రెండవ ఆర్డర్‌ను అంగీకరించిన తర్వాత, మీరు పికప్ కోసం ఆ రెస్టారెంట్ లొకేషన్‌కు పంపబడతారు
  • రెండు ఆర్డర్‌లలోని ఐటమ్‌లను సరిచూసుకున్న తర్వాత, మీరు మీ మొదటి డెలివరీని చేస్తారు
  • మీరు మీ మొదటి డెలివరీని పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాచ్డ్ ట్రిప్‌ను పూర్తి చేయడం కోసం మీ రెండవ డెలివరీని పూర్తి చేయండి

నేను బ్యాచ్డ్ ట్రిప్‌ను తిరస్కరించవచ్చా?

అవును. బ్యాచ్డ్ డెలివరీలతో సహా ఏ డెలివరీ అభ్యర్థననైనా మీరు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

బ్యాచ్డ్ ఆర్డర్‌లకు నా డెలివరీ ఫీజును ఎలా లెక్కిస్తారు?

బ్యాచ్డ్ ఆర్డర్‌లకు, మీ డెలివరీ ఫీజును ఈ క్రింది విధంగా లెక్కిస్తారు: 1. ఫ్లాట్ పికప్ ఫీజు + 2. ఒక్కొక్క రెస్టారెంట్‌కు (ప్రతి అదనపు రెస్టారెంట్‌కు 0.45 రెట్ల ఫ్లాట్ పికప్ ఫీజు మీకు అందుతుంది) మైలుకు (కిలోమీటర్‌కు) రేటు + పికప్ ఫీజు గుణకం వర్తించబడుతుంది - పికప్ లొకేషన్‌లు మరియు డ్రాప్‌ఆఫ్ పాయింట్‌ల మధ్య దూరంతో ఒక్కో మైలు(కిలోమీటర్‌‌) ఛార్జీని గుణించి లెక్కిస్తారు. - ఈ లెక్కింపు అత్యంత సమర్థవంతమైన దారిపై ఆధారపడి ఉంటుందే తప్ప, వాస్తవంగా ప్రయాణించిన మైళ్ళ (కిలోమీటర్‌ల) పై కాదు 3. నగరాన్ని బట్టి మీరు ఒక్కో నిమిషం చొప్పున రేటును అందుకోవచ్చు + - మొదటి రెస్టారెంట్‌కు రావడం మొదలుకొని, చివరి డ్రాప్‌ఆఫ్ వరకు వెచ్చించిన సమయాన్ని బట్టి లెక్కిస్తారు. - ఈ లెక్కింపు అంచనా వేసిన సమయంపై ఆధారపడి ఉండవచ్చు. పికప్‌ల వద్ద వేచి ఉండటానికి తీసుకునే అంచనా సమయం, మొదటి రెస్టారెంట్ నుండి చివరి డ్రాప్‌ఆఫ్ వరకు పట్టే అంచనా ప్రయాణ సమయం మరియు డ్రాప్‌ఆఫ్‌లలో వేచి ఉండటానికి తీసుకునే అంచనా సమయం (వాస్తవ సమయం కాదు) అందులో చేర్చి ఉంటాయి - గమనిక: సమయ ఆధారిత ఛార్జీలు ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే వర్తించవచ్చు. మీ నగరానికి డెలివరీ ఫీజులలో సమయ ఆధారిత ఛార్జీ అంశం ఉన్నట్లయితే మరిన్ని వివరాల కోసం దయచేసి uber.com లోని మీ నగరపు వెబ్‌సైట్‌ను చూడండి. 4. ఫ్లాట్ డ్రాప్ఆఫ్ ఫీజు - మీరు కస్టమర్‌కు డ్రాప్ ఆఫ్ చేసే ప్రతి ఆర్డర్‌కు ఫ్లాట్ డ్రాప్‌ ఆఫ్ ఫీజును పొందుతారు

మీ నగరానికి వర్తించే ఖచ్చితమైన రేట్ల కోసం దయచేసి Uber.com లోని మీ నగర వెబ్‌సైట్‌ను చూడండి.

ఉదాహరణకు, మీరు రెండు వేర్వేరు రెస్టారెంట్‌ల నుండి రెండు ఆర్డర్‌లను పికప్ చేసారనుకోండి. ఫ్లాట్ పికప్ ఫీజు $1.50. అలాగే, మైలుకు ఫీజు $0.60, సమయాన్నిబట్టి నిమిషానికి ఛార్జీ $0.15 మరియు మీరు ఈ ట్రిప్‌లో 12 నిమిషాలు గడిపారు, మరియు ఒక డ్రాప్‌ఆఫ్ ఫీజు $1.00 (మీరు రెండు వేర్వేరు ఆర్డర్‌లను డ్రాప్ ఆఫ్ చేస్తున్నందువలన దాన్ని రెండుతో గుణించాలి). కాబట్టి, ఇది అంతా కలిపితే వచ్చే మొత్తం: - పికప్ ఫీజు = $1.50 - అదనపు పికప్ ఫీజు = (0.45$1.50) = $0.68 - మైలుకు(కిలోమీటర్‌) ఛార్జీ = $0.60 - సమయ ఆధారిత ఛార్జీ = (12$0.15) = $1.80 (మీ నగరంలో వర్తిస్తే) - డ్రాప్ ఆఫ్ ఫీజు = (2*$1.00) = $2.00 మొత్తం చెల్లింపు = $1.50+$0.68+$0.60+$1.80+$2.00 = $6.58

నా మొదటి కస్టమర్‌ను నేను కనుగొనలేకపోయిన కారణంగా నా రెండవ ఆర్డర్‌కు ఆలస్యం అయితే ఏమి చేయాలి?

డెలివరీ చేసేటప్పుడు మీరు కస్టమర్‌ను కనుగొనలేకపోతే, మీరు వారికి కాల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. వారు సమాధానం ఇవ్వనట్లయితే, వారు సమాధానం ఇవ్వలేదని సూచించే బ్యానర్‌ను మీరు నొక్కవచ్చు. ఇది వారికి నోటిఫికేషన్‌ను పంపుతుంది, టైమర్ ప్రారంభమవుతుంది.

కౌంట్‌డౌన్ పూర్తయ్యే సమయానికి వారు మిమ్మల్ని సంప్రదించకపోతే, డెలివరీని ముగించడానికి ప్రాంప్ట్‌లను మీరు అనుసరించినా, మీకు మొదటి డెలివరీకి చెల్లింపు జరుగుతుంది మరియు ఇది మీ రద్దు రేటింగ్‌ను ప్రభావితం చేయదు. అప్పుడు మీరు మీ రెండవ డెలివరీని పూర్తి చేయడానికి ముందుకు సాగవచ్చు.

బ్యాచ్ద్ ట్రిప్ అభ్యర్థనలను స్వీకరించడం నుండి నేను పూర్తిగా వైదొలగవచ్చా?

లేదు, బ్యాచ్ద్ ట్రిప్‌ల అభ్యర్థనలను స్వీకరించడాన్ని పూర్తిగా నిలిపివేసే ఎంపికకు మేము ప్రస్తుతం మద్దతును ఇవ్వడం లేదు. ఏదేమైనా, బ్యాచ్ద్ ట్రిప్ అభ్యర్థనలతో సహా ఏ ట్రిప్ అభ్యర్థననైనా మీరు అంగీకరించడానికి తిరస్కరించవచ్చు.