బిజినెస్‌ల నుంచి వోచర్‌లను ఉపయోగించడం

వ్యాపార సంస్థలు తాము నిర్దేశించే కొన్ని ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్న రైడ్‌లకు లేదా Uber Eats ఆర్డర్‌లకు, క్రెడిట్ ఇవ్వడానికి వోచర్‌లను అందించవచ్చు. మీ వోచర్‌ను కేవలం రైడ్‌లకు మాత్రమే ఉపయోగించవచ్చా లేదా రైడ్‌లు మరియు ఆర్డర్‌లు రెండింటికి ఉపయోగించవచ్చా అనే విషయం యాప్ మీకు తెలియజేస్తుంది.

మీరు Uber for Businessను ఉపయోగించే యజమాని లేదా కోఆర్డినేటరా? వోచర్‌లను నిర్వహించడానికి,Uber for Business సహాయక కేంద్రం నుండి సహాయాన్ని పొందండి.

వోచర్‌ను రీడిమ్ చేయడం

  1. Uber యాప్‌‌లోనికి సైన్ఇన్ చేయండి లేదా uber.comతో ఖాతాను సృష్టించండి.
  2. వోచర్‌ను క్లెయిమ్ చేయడానికి, మీ ఇమెయిల్‌లోని లింక్‌ను క్లిక్ చేయండి.
  3. వోచర్‌ను మీ ఖాతాకు ఆటోమేటిక్‌గా జోడిస్తారు, అర్హత కలిగిన మీ తదుపరి ట్రిప్ లేదా ఆర్డర్‌కు వర్తిస్తుంది.

మీరు మీ వ్యక్తిగత ప్రొఫైల్‌ను ఉపయోగిస్తున్నట్లుగా నిర్ధారించుకోండి. వోచర్‌లు బిజినెస్ ప్రొఫైల్‌లో పనిచేయవు.

గమనిక: వోచర్‌లు ట్రిప్‌కు లేదా ఆర్డర్ ధరకు మాత్రమే వర్తిస్తాయి. మీరు డ్రైవర్‌కు ఇచ్చే టిప్‌లు మరియు వోచర్ విలువను మించిపోయిన మొత్తాలను, మీ వ్యక్తిగత చెల్లింపు పద్ధతి ద్వారా మీకు ఛాార్జీ చేస్తారు.

మీ ఖాతాలో వోచర్‌లను చూడండి

  1. మీ Uber యాప్‌ను తెరిచి, ఖాతాను తట్టండి.
  2. “వాలెట్”ను తట్టండి.
  3. క్రిందికి స్క్రోల్ చేసి, "వోచర్లు"పై తట్టండి.

మరొక ట్రిప్ కోసం వోచర్‌ను సేవ్ చేయండి.

  1. "ఎక్కడికి వెళ్ళాలి?" ఫీల్డ్‌లో, మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి.
  2. వాహనం ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. "[వాహన రకం]ను ఎంచుకోండి" బటన్ పై చెల్లింపు పద్ధతిని తట్టండి.
  4. వోచర్ పక్కన "మార్చండి"ని తట్టి, మరొక చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.

గమనిక: మీకు ఒకటి కంటే ఎక్కువ రైడ్ ప్రొఫైల్‌లు ఉంటే, ట్రిప్ కోసం దానిని ఉపయోగించే ముందు, మీరు వోచర్‌ ఉండే ప్రొఫైల్‌ను ఎంచుకోవాలి.