మీ ట్రిప్ పూర్తయిన తర్వాత ఇమెయిల్‌లో మీకు పంపిన రసీదు నుండి డ్రైవర్‌కు ఇచ్చిన స్టార్ రేటింగ్‌ను మీరు మార్చవచ్చు.
ఇమెయిల్‌లో, “రేటు లేదా టిప్” ఎంచుకోండి. మిమ్మల్ని uber.comలోని మీ ఖాతాకు మళ్లిస్తారు, అక్కడ మీ డ్రైవర్‌కు ఇచ్చిన స్టార్ రేటింగ్‌ను మీరు అప్డేట్ చేయవచ్చు. ట్రిప్ రద్దయితే, డ్రైవర్‌కు రేటింగ్ ఇచ్చే ఎంపిక మీకు కనిపించదు.
రసీదు ఇమెయిల్‌ను మళ్ళీ పంపడానికి:
మీరు డ్రైవర్‌కు 1 స్టార్ రేటింగ్ ఇస్తే, భవిష్యత్తులో ఆ డ్రైవర్‌ను మీకు కేటాయించకుండా ఉండటానికి మేము ప్రయత్నిస్తామని గమనించగలరు.
రైడర్లు మరియు డ్రైవర్లకు సహాయం అందించడానికి రేటింగ్‌ల విధానం రూపొందించాము. ఖచ్చితమైన రేటింగ్‌ను అందించడానికి సమయం తీసుకుని, మీ ఫీడ్‌బ్యాక్‌ను పంచుకోవడం ద్వారా, Uber ప్లాట్ఫారంలో అందరికీ నాణ్యమైన రైడ్‌ను అందించడంలో మీరు మాకు సహాయం చేస్తున్నారు.