Android‌లో సేవ్ చేసిన ప్రదేశాలను జోడించడం

మీరు తరచుగా ప్రయాణించే గమ్యస్థానాలైన వర్క్ లేదా హోమ్ వంటివి మీరు యాప్‌లో జోడించవచ్చు.

మీ హోమ్ లేదా వర్క్ అడ్రస్‌ను సేవ్ చేయడానికి:

  1. ప్రధాన స్క్రీన్ నుండి, "ఖాతా"ను ఎంచుకోండి.
  2. "సెట్టింగ్‌ల"పై తట్టండి.
  3. "హోమ్‌ను జోడించండి" లేదా "వర్క్‌ను జోడించండి"పై తట్టండి.
  4. మీ హోమ్ లేదా వర్క్ అడ్రస్‌ను నమోదు చేయండి.

మీ యాప్‌ విభాగంలోని అకౌంట్ సెట్టింగ్‌లలోని ఫేవరే‌ట్‌లజాబితాలో అడ్రస్‌లు కనిపిస్తాయి.

ఫేవరే‌ట్‌ల నుండి వర్క్ లేదా హోమ్‌ను తీసివేయడం:

  1. ప్రధాన స్క్రీన్ నుండి, "ఖాతా"ను ఎంచుకోండి.
  2. "సెట్టింగ్‌ల"పై తట్టండి.
  3. "హోమ్" లేదా "వర్క్" పక్కన, "తొలగించండి" మీద తట్టండి.

ఇతర సేవ్ చేయబడిన స్థలాలను జోడించడం మరియు తొలగించడం

మీరు గమ్యస్థానానికి ట్రిప్ పూర్తి చేసిన తర్వాత, మీ యాప్ ఫీడ్‌లో “ఈ గమ్య స్థలాన్ని సేవ్ చేయండి” కార్డ్ మీకు కనిపిస్తుంది.

  1. “సేవ్ చేసిన ప్రదేశాలకు జోడించండి”పై తట్టండి.
  2. స్థలం పేరు లేదా మారుపేరును టైప్ చేయండి ("జోస్ ఇల్లు" లేదా "పెట్ స్టోర్" వంటివి).
  3. "సేవ్ చేయండి"పై తట్టండి.

సెట్టింగ్‌ల నుండి సేవ్ చేయబడిన స్థలాన్ని జోడించడానికి:

  1. ప్రధాన స్క్రీన్ నుండి, "ఖాతా"ను ఎంచుకోండి.
  2. "సెట్టింగ్‌ల"పై తట్టండి.
  3. “మరిన్ని సేవ్ చేయబడిన స్థలాలు” ఆపై “సేవ్ చేసిన స్థలాన్ని జోడించండి”పై తట్టండి.
  4. మీరు సేవ్ చేయాలనుకుంటున్న స్థలం అడ్రస్‌ను నమోదు చేయండి.
  5. స్థలం పేరు లేదా మారుపేరును టైప్ చేయండి ("జోస్ ఇల్లు" లేదా "పెట్ స్టోర్" వంటివి).
  6. "సేవ్ చేయండి"పై తట్టండి.

సేవ్ చేసిన స్థలాన్ని తొలగించడానికి:

  1. ప్రధాన స్క్రీన్ నుండి, "ఖాతా"ను ఎంచుకోండి.
  2. "సెట్టింగ్‌ల"పై తట్టండి.
  3. “మరిన్ని సేవ్ చేసిన స్థలాలు”పై తట్టండి.
  4. మీరు తొలగించాలనుకున్న స్థలం పక్కన ఉన్న మూడు చుక్కలను తట్టండి.
  5. "తొలగించండి"ని ఎంచుకోండి.