బిజినెస్ రైడ్ ప్రొఫైల్‌ను సృష్టించడం

రైడ్‌‌లకు సంబంధించిన ఛార్జీలను మీ బిజినెస్ క్రెడిట్ కార్డ్‌కు విధించడంతోపాటు, వాటి రసీదులను మీ కార్యాలయ ఇమెయిల్ అడ్రస్‌కు అందేలా బిజినెస్ రైడ్ ప్రొఫైల్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు మీ కంపెనీ బిజినెస్ ఖాతాలో చేరవచ్చు, లేదా మీరు స్వంతంగా ఒక బిజినెస్ రైడ్ ప్రొఫైల్‌ను కూడా రూపొందించుకోవచ్చు.

బిజినెస్ రైడ్ ప్రొఫైల్‌ను సృష్టించడానికి:

  1. Uber యాప్‌ను తెరిచి, "ఖాతా"ను తట్టండి.
  2. "వాలెట్"ను తట్టి, ఆపై "రైడ్ ప్రొఫైల్స్"కు క్రిందికి స్క్రోల్ చేయండి.
  3. "Uber for Businessను ఉపయోగించడం ప్రారంభించండి" లేదా "మరొక బిజినెస్ ప్రొఫైల్‌ను జోడించండి" మీద తట్టండి.
  4. మీ బిజినెస్ ప్రొఫైల్‌ను రూపొందించేందుకు, ప్రాంప్ట్‌లను అనుసరించండి.
  5. ఐచ్ఛికం: రసీదును ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ చేయడం ప్రారంభించేందుకు మీ కంపెనీ ఎక్స్‌పెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి (లింక్ చేసే ప్రక్రియ‌ను పూర్తి చేయడానికి మీకు ఒక ఇమెయిల్ వస్తుంది). ఎక్స్‌పెన్స్ ప్రొవైడర్‌ను తర్వాత జోడించడానికి, వ్యక్తిగత లేదా వ్యాపార రైడ్ ప్రొఫైల్‌ను ఎలా సవరించాలి ని చూడండి.

మీరు మీ బిజినెస్ క్రెడిట్ కార్డ్‌కు ఛార్జీ విధించాలని కోరుకుంటే, మీరు రైడ్‌ను ప్రారంభించే ముందు లేదా రైడ్ కొనసాగిస్తున్నప్పుడు తప్పనిసరిగామీ బిజినెస్ రైడ్ ప్రొఫైల్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

మీ కంపెనీ బిజినెస్ ఖాతాలో చేరడానికి, సూచనల కోసం క్రింది లింక్‌ను తట్టండి.