వాయిస్‌ఓవర్‌తో యాప్ మెపూని నావిగేట్ చేయడానికి, మీ యాప్‌ను తెరిచి, మెనూని తెరవడానికి మీ స్క్రీన్ ఎగువున ఎడమవైపు రెండుసార్లు తట్టండి. క్రింది ఎంపికలు పై నుండి క్రిందకి కనిపిస్తాయి:
మీ ట్రిప్‌లు - ఈ విభాగం మీ గత రైడ్లను జాబితా చేస్తుంది లేదా మీరు పొందబోయే, షెడ్యూల్ చేసిన రైడ్లను చూపుతుంది. మూడు వేళ్లను ఉపయోగించి మీ రైడ్ చరిత్రను స్వైప్ చేయండి. ట్రిప్ గురించి సహాయం పొందడానికి, అభిప్రాయాన్ని సమర్పించడానికి లేదా ట్రిప్ రసీదును చూడటానికి ఒకటి ఎంచుకోండి.
వాలెట్ - ఈ విభాగంలో మీరు చెల్లింపు పద్ధతిని జోడించడం లేదా అప్డేట్ చేయడం వంటివి చేయవచ్చు
సహాయం - మీ ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ కథనాలలో వెతకండి. మీరు ఈ విభాగంలో సౌలభ్య సామర్థ్యాల విశేషాంశాలకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా సమర్పించవచ్చు.
ఉచిత రైడ్లు - యాప్‌ను ఉపయోగించమని ఇతరులను ఆహ్వానించడానికి ఈ విభాగంలో స్టోర్ చేసిన వ్యక్తిగత ఆహ్వాన కోడ్‌ను ఉపయోగించండి
సెట్టింగ్‌లు - మీ సంప్రదింపు సమాచారాన్ని అప్డేట్ చేయండి, ఇల్లు లేదా కార్యాలయం వంటి ఇష్టమైన లొకేషన్లను సెట్ చేయండి లేదా ట్రిప్‌కు ముందు లేదా ట్రిప్‌లో ఉన్నప్పుడు మీ లొకేషన్‌ను త్వరగా షేర్ చేయడానికి పరిచయాలను జోడించండి
మద్దతు విభాగాన్ని సంప్రదించండి
మీకు సౌలభ్య సామర్థ్యాలకు సంబంధించి ఏవైనా సందేహాలున్నా లేదా మీరు ఏదైనా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్నా, మెనులోని "సహాయం" విభాగంలోని "సౌలభ్య సామర్థ్యాలు" ఎంపికని నొక్కడం ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మెనులోని "మీ ట్రిప్‌లు" విభాగం నుండి నిర్దిష్ట ట్రిప్‌ను ఎంచుకోవడం ద్వారా ఏదైనా ఇతర ట్రిప్‌కి సంబంధించిన సమస్యను నివేదించండి. తదుపరి స్క్రీన్ నుండి, మీరు సమస్యను నివేదించడానికి అనేక ఎంపికల నుండి ఎంచుకోవచ్చు.