TalkBackని ఆన్ చేసి రైడ్‌ను ఎలా అభ్యర్థించాలో ఇక్కడ చూడండి:
- "ఎక్కడికి వెళ్లాలి?" అనే బాక్స్‌పై ఒక్కసారి తట్టి, ఆపై రెండు సార్లు తట్టండి. గమ్యస్థానాన్ని నమోదు చేయండి లేదా సూచించిన గమ్యస్థానాల జాబితా నుండి ఎంచుకోండి.
- మీ పికప్ లొకేషన్ ఆటోమేటిక్‌గా మీ GPS లొకేషన్‌కు సెట్ చేయబడుతుంది. దాన్ని మార్చడానికి, మీ పికప్ లొకేషన్‌పై తట్టి, ఆపై మీ లొకేషన్‌ను సవరించడానికి రెండుసార్లు దానిపై తట్టండి.
- మీ ప్రాంతంలో అందుబాటులో ఉండే వాహన ఎంపికలను చూసేందుకు, రెండు వేళ్లను ఉపయోగించి స్వైప్ చేయండి. ఒక్కసారి తట్టండి, తరువాత మీ రైడ్ కొరకు దానిని ఎంచుకోవడానికి రెండుసార్లు తట్టండి.
- ఒక్కసారి తట్టి, తరువాత మీ రైడ్‌ను అభ్యర్థించడానికి మీ స్క్రీన్‌కి దిగువన ఉన్న"పికప్‌ను ధృవీకరించండి" బటన్‌ను రెండుసార్లు తట్టండి
- మీ డ్రైవర్ వచ్చినప్పుడు మీరు నోటిఫికేషన్‌ను అందుకుంటారు. సందేశం బిగ్గరగా చదవబడుతుంది.
- క్రింది ఎంపికలను యాక్సెస్ చేయడానికి, మీ స్క్రీన్ దిగువన ఉన్న బార్‌ను ఒకసారి తట్టి, ఆపై రెండుసార్లు తట్టండి:
- మీ డ్రైవర్‌ను సంప్రదించడం- మీ డ్రైవర్ ఫోన్ నెంబర్‌కు కాల్ చేయడానికి లేదా ఉచిత కాల్ చేయడానికి గుండ్రంగా ఉండే ఫోన్ ఐకాన్ని ఒక్కసారి తట్టి, ఆపై రెండుసార్లు తట్టండి
- మీ రైడ్‌ని రద్దు చేయడం - ఒక్కసారి తట్టండి, తరువాత "రద్దు చేయండి" బటన్‌ను రెండుసార్లు తట్టండి, తరువాత ఒక్కసారి తట్టండి, అప్పుడు ధృవీకరించడానికి "అవును, రద్దు చేయండి" బటన్‌ను రెండుసార్లు తట్టండి.
- మీ స్టేటస్‌ను పంచుకోవడానికి -ఒక్కసారి తట్టండి, తరువాత "స్టేటస్‌ను పంచుకోండి" బటన్‌ను రెండుసార్లు తట్టండి, తర్వాత మీ కాంటాక్ట్‌ల జాబితా నుండి వ్యక్తులను ఎంచుకోండి. మీ రైడ్‌ను ట్రాక్ చేయడానికి, ఆ కాంటాక్టులకు Uber ఒక లింక్‌ను టెక్ట్స్‌గా పంపుతుంది.
- ఛార్జీని విభజించడం -ఒక్కసారి తట్టండి, తరువాత "ఛార్జీని విభజించండి" బటన్‌ను రెండుసార్లు తట్టి, కాంటాక్ట్‌ని ఎంచుకోండి