యాప్‌తో TalkBackను ఎలా ఉపయోగించాలో ఈ కథనం వివరిస్తుంది.
మీ డెలివరీ స్థానాన్ని మరియు డెలివరీ సమయాన్ని సెట్ చేయడం
యాప్‌లో మొదటిసారి సైన్ అప్ చేసిన తర్వాత, ముందుగా మీ డెలివరీ లొకేషన్‌ను నమోదు చేయాల్సిందిగా మిమ్మల్ని నిర్దేశిస్తారు.
మీరు ఇప్పటికే హోమ్ స్క్రీన్‌పై ఉన్నట్లయితే, ఈ దశలను అనుసరించండి:
- హోమ్ స్క్రీన్ నుండి, స్క్రీన్ ఎగువ ఎడమవైపున రెండుసార్లు తట్టండి.
- మీ చిరునామాను నమోదు చేయండి లేదా సూచించిన గమ్యస్థానాల జాబితా నుండి ఎంచుకోండి.
- డెలివరీ సమయాన్ని సెట్ చేయండి (ASAP లేదా షెడ్యూల్డ్ డెలివరీ.)
మీరు డెలివరీ వివరాలను ఒకసారి నమోదు చేయడం పూర్తి చేసిన తర్వాత, మీరు ఆర్డర్ చేయడానికి సమీపంలోని మర్చంట్లను మేము కనుగొంటాం.
డెలివరీ స్థానం మరియు డెలివరీ సమయాన్ని మార్చడం
మీరు డెలివరీ వివరాల పేజీకి బదులుగా ఆటోమేటిక్‌గా హోమ్ ఫీడ్‌కు మళ్ళిస్తే, డెలివరీ చిరునామా మీరు డిఫాల్ట్‌గా నమోదు చేసే చివరి స్థానం అవుతుంది.
కానీ మీరు దీన్ని ముందుగా మార్చాలని అనుకుంటే, ఈ సూచనలను అనుసరించండి:
- హోమ్ స్క్రీన్ నుండి, స్క్రీన్ ఎగువ ఎడమవైపున రెండుసార్లు తట్టండి.
- మీ చిరునామాను నమోదు చేయండి లేదా సూచించిన గమ్యస్థానాల జాబితా నుండి ఎంచుకోండి.
- డెలివరీ సమయాన్ని సెట్ చేయండి (ASAP లేదా షెడ్యూల్డ్ డెలివరీ.)
మర్చంట్లను ఎంచుకోండి
హోమ్ స్క్రీన్ ఫీడ్‌లో, మీరు ఆర్డర్ చేయగల విభిన్న మర్చంట్ల ఎంపికను మేము జాబితా చేస్తాము. సిఫార్సుల ద్వారా నావిగేట్ చేయడానికి ఎడమ లేదా కుడి వైపుకు స్వైప్ చేయండి.
మీరు స్క్రీన్ దిగువన ఉన్న సెర్చ్ ట్యాబ్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా కూడా వెతకవచ్చు:
- స్క్రీన్ దిగువన ఒక్కసారి తట్టండి.
- సెర్చ్ ట్యాబ్, హోమ్ ట్యాబ్ పక్కనే ఉంటుంది, రెండుసార్లు తట్టడం ద్వారా దానిని యాక్టివేట్ చేయవచ్చు.
- అక్కడికి చేరుకున్న తర్వాత, సిఫార్సు చేసిన వంటకాల కేటగిరీలు లేదా మర్చంట్/డిష్/వంటల రకాలను వెతకడానికి ఎంచుకోండి.
ఆర్డర్ చేయండి
మీరు ఎవరి నుంచి ఆర్డర్ చేయాలని అనుకుంటున్నారో, ఆ మర్చంట్‌ను ఎంచుకున్న తర్వాత, ఈ దశలను అనుసరించండి:
- స్టోర్ మెనూ పేజీ నుండి, “కార్ట్‌కు జోడించండి” ఎంపికను రెండుసార్లు తట్టడం ద్వారా కార్ట్‌కు ఐటమ్(ల)ను జోడించండి
- మీరు ఆర్డర్ చేయాలని అనుకుంటున్న ప్రతిదాన్ని జోడించే వరకు దీన్ని పునరావృతం చేయండి
- మీరు మీ కార్ట్‌ను నింపడం పూర్తి చేసిన తర్వాత, "కార్ట్‌ను చూడండి" ఎంపిక వినిపించే వరకు స్వైప్ చేయండి. చెక్ అవుట్ పేజీకి వెళ్ళడానికి రెండుసార్లు తట్టండి
- ఆపై మీరు ఆర్డర్ వివరాలను సమీక్షించగలరు: డెలివరీ చిరునామా/సమయం, కార్ట్‌లోని ఐటెమ్‌లు, చెల్లింపు పద్ధతులను నిర్ధారించగలరు, ప్రొమో కోడ్లను జోడించగలరు (ఏవైనా ఉంటే)
- మీరు దీన్ని సమీక్షించడం పూర్తి చేసిన తర్వాత, మీకు “ఆర్డర్ చేయండి” ఎంపిక వినిపించే వరకు స్వైప్ చేసి, మీరు ఆర్డర్ చేయండి. దీన్ని ఎంచుకోవడానికి రెండుసార్లు తట్టండి
మీ ఆర్డర్‌ను రద్దు చేయడం
"ఆర్డర్ చేయండి" బటన్ నొక్కిన తర్వాత, యాప్ అభ్యర్థించే స్థితికి మారుతుంది.
మీ ఆర్డర్‌ను రద్దు చేయడానికి:
- రద్దు చేయండి బటన్‌ను హైలైట్ చేయడానికి కుడివైపుకు ఫ్లిక్ చేయండి.
- మీకు ఒక డెలివరీ వ్యక్తిని మ్యాచ్ చేసిన తర్వాత, “రద్దు చేయండి” పక్కనే కాంటాక్ట్ బటన్ జోడించబడుతుంది.
ఆర్డర్ కోసం వేచి ఉండటం
యాప్‌లోని ETA ఆప్షన్, మీ ఆర్డర్ ఎప్పుడు వస్తుందో మీకు తెలియజేస్తుంది. మీ ఆర్డర్ ఎంత త్వరగా వస్తుందో తెలుసుకోవడానికి, మీరు ETA అంశాన్ని హైలైట్ చేయవచ్చు. మీకు డెలివరీ చేసే వ్యక్తితో మ్యాచ్ అయిన తర్వాత, డెలివరీ చేసే వ్యక్తి పేరు, వాహనం మోడల్, రేటింగ్ మరియు లైసెన్స్ ప్లేట్ నంబర్‌ను వినడానికి మీరు స్క్రీన్ దిగువన ఉన్న కార్డ్‌ను కూడా హైలైట్ చేయవచ్చు.
మీ ఆర్డర్ మరియు డెలివరీ వ్యక్తిని రేట్ చేయండి
ఆర్డర్ పూర్తి అయిన తర్వాత, హోమ్ స్క్రీన్ పై భాగంలో రేటింగ్ కార్డ్ కనిపిస్తుంది. డెలివరీ చేసిన వ్యక్తిని మరియు మర్చంట్‌ను రేట్ చేయడానికి కార్డ్‌పై రెండుసార్లు తట్టండి, అలాగే డెలివరీ చేసిన వ్యక్తికి టిప్ ఇవ్వండి.
ఖాతా సెట్టింగ్‌లు
స్క్రీన్ కుడి దిగువ మూల తట్టడం ద్వారా ఖాతా ట్యాబ్‌ను యాక్సెస్ చేయవచ్చు. అందుబాటులో ఉన్న ఆప్షన్లు:
- ఖాతా: ఇక్కడ మీరు మీకు ఇష్టమైన డెలివరీ చిరునామాను అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడైనా చిరునామాను మార్చాలి అనుకున్నప్పుడు మాన్యువల్‌గా నమోదు చేయాల్సిన అవసరం లేదు. మీరు "ఖాతాను సవరించండి" ఆప్షన్ని ఎంచుకోవడం ద్వారా మీ ఫోన్ నెంబర్‌ను కూడా సవరించవచ్చు.
- మీకు ఇష్టమైనవి: మీరు ఇంతకు ముందు బుక్‌మార్క్ చేసిన లేదా ఆర్డర్ చేసిన మర్చంట్ల జాబితాను ఇక్కడ వినవచ్చు.
- చెల్లింపు: చెల్లింపు పద్ధతిని మార్చడానికి లేదా జోడించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
- సహాయం: యాక్సెసబిలిటీ సమస్యలను నివేదించే సామర్థ్యంతో సహా అనేక రకాల మద్దతు ఎంపికలను అందిస్తుంది.
- ప్రమోషన్లు: మీ ఖాతాతో ఇప్పటికే అసోసియేట్ అయిన ప్రమోషన్లను ఇక్కడ వీక్షించండి, లేదా కొత్త ప్రొమో కోడ్‌ను జోడించండి.
- ఉచిత ఆహారం: స్నేహితులను సూచించడం ద్వారా భవిష్యత్ ఆర్డర్ల కోసం క్రెడిట్లను పొందడానికి ఈ ఆప్షన్ని ఉపయోగించండి. ఇక్కడ మీరు మీ రీఫరల్ ఆహ్వాన కోడ్‌ను కనుగొనవచ్చు.
- మాతో కలిసి డెలివరీ చేయండి: డెలివరీ వ్యక్తిగా ఉండటానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
- సెట్టింగ్‌లు: పైన జాబితా చేసిన ఖాతా ఆప్షన్ వలే అదే వివరాలు.