మీ ఆర్డర్‌ను మర్చంట్ లేదా డెలివరీ చేసే వ్యక్తి రద్దు చేయవచ్చు. రద్దు చేసిన సందర్భంలో, మీరు కొన్ని నిమిషాల్లో మళ్ళీ అదే మర్చంట్ నుండి లేదా మరొక మర్చంట్ నుండి ఆర్డర్ చేయడానికి ప్రయత్నించవచ్చు.
మర్చంట్‌లు ఎందుకు ఆర్డర్‌లను రద్దు చేయవచ్చు
వారి వద్ద ఒక ఐటమ్ అయిపోతే లేదా వారు పెద్ద మొత్తంలో ఆర్డర్ అభ్యర్థనలను అందుకుంటుంటే ఇది జరగవచ్చు.
మర్చంట్ వద్ద ఒక ఐటమ్ అయిపోతే, మీ ఆర్డర్ ఆటోమేటిక్‌గా రద్దు చేయబడడానికి ముందు, దాన్ని అప్‌డేట్ చేయడానికి మీకు 10 నిమిషాల సమయం ఇస్తూ, మీరు ఒక నోటిఫికేషన్ అందుకోవచ్చు.
మర్చంట్ మీ ఆర్డర్‌ను రద్దు చేస్తే మీకు ఛార్జీ విధించరు.
డెలివరీ చేసే వ్యక్తులు ఆర్డర్‌లను ఎందుకు రద్దు చేయవచ్చు
ఇది జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి:
మిమ్మల్ని సంప్రదించడం సాధ్యం కాలేదు
- మీ డెలివరీ చిరునామాకు చేరుకున్నప్పుడు, డెలివరీ చేసే వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రాంప్ట్ చేయబడతారు, కాబట్టి ఆర్డర్ వస్తుందని ఆశించినప్పుడు మీ ఫోన్‌ను సమీపంలో ఉంచుకోవడం మంచిది.
- డెలివరీ చేసే వ్యక్తి మిమ్మల్ని కనుగొనలేకపోతే లేదా మిమ్మల్ని సంప్రదించలేకపోతే డెలివరీని రద్దు చేయవచ్చు.
- డెలివరీ చేసే వ్యక్తి మిమ్మల్ని చేరుకోలేకపోయినా, మీరు అభ్యర్థించిన లొకేషన్‌కు చేరుకున్న తర్వాత మిమ్మల్ని సంప్రదించడానికి సహేతుకమైన ప్రయత్నం చేస్తే, మీరు రీఫండ్‌కు అర్హులు కాకపోవచ్చు.
మర్చంట్ మూసివేశారు
- డెలివరీ చేసే వ్యక్తి మర్చంట్ వద్దకు వచ్చినప్పుడు, ఊహించని విధంగా వారు మూసివేసి ఉండవచ్చు.
- మీరు అభ్యర్థించిన ఐటమ్స్ స్టాక్ లో లేకపోవచ్చు, కాబట్టి ఆర్డర్ నెరవేరలేదు.
రద్దు చేసిన ఆర్డర్ కోసం మీకు తప్పుగా ఛార్జీ విధించినట్లుగా మీరు భావిస్తే, దిగువ మాకు తెలియజేయండి.