అధికార నిలుపుదలలు - తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు ఆర్డర్ చేసినప్పుడు, అది ఒక అధికార నిలుపుదల సృష్టిస్తుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో చెల్లించే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. మీ ఫండ్‌లు చేరాల్సిన చోటుకు విజయవంతంగా చేరగలవని నిర్ధారించడానికి అధికార నిలుపుదల మాకు ఒక మార్గం. ఇవి చెల్లింపు ఛార్జీలు కావు.

అధికార నిలుపుదలలు తాత్కాలికమైనవి, మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉన్నపెండింగ్‌ లైన్ లావాదేవీ కొన్ని రోజుల తర్వాత అదృశ్యమవుతుంది.

గమనిక: మీరు ఆర్డర్‌ను రద్దు చేసి, ఇప్పటికీ ఈ అధికార నిలుపుదలను చూస్తుంటే, రీఫండ్ ప్రాసెస్ చేయడానికి 3-10 రోజులు పట్టవచ్చు.

అధికార నిలుపుదలలపై మరింత సమాచారం కోసం, మా 'తరచుగా అడిగే ప్రశ్నల'ను చూడండి:

ఒక ఆర్డర్ కోసం నాకు రెండుసార్లు ఎందుకు ఛార్జీ విధించారు?

కొన్నిసార్లు, అధికార నిలుపుదలను అసలు ఛార్జ్ ప్రాసెస్ చేసే వేగంతో ప్రాసెస్ చేయరు, దాని వలన మీకు రెండుసార్లు ఛార్జ్ చేసినట్లుగా కనిపిస్తుంది. దీని అర్థం మీకు రెండుసార్లు ఛార్జీ విధించినట్లు కాదు. ఎందుకంటే మీరు మొదటిసారి ఆర్డర్ చేసినప్పుడు, మేం తాత్కాలికంగా ఛార్జ్ చేస్తాము, ఇది మీ చెల్లింపు పద్ధతితో

ఒక హోల్డ్ లాగా పనిచేస్తుంది.

మీ ఆర్డర్ రద్దు చేస్తే, తాత్కాలిక అధికార నిలుపుదల కొన్ని పని రోజుల్లో రివర్స్ అవుతుంది.

అధికార నిలుపుదలను ఎప్పుడు తొలగిస్తారు?

ఛార్జ్ పూర్తయిన తర్వాత సాధారణంగా 3-10 పని దినాలు పడుతుంది. మీ బ్యాంక్ ప్రాసెసింగ్ సమయాలు లేదా పాలసీని బట్టి కొన్నిసార్లు దాని కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.

అధికార నిలుపుదలపై మరింత సమాచారాన్ని నేను ఎక్కడ పొందగలను?

మీరు మీ స్టేట్‌మెంట్‌లో చూస్తున్న అధికార నిలుపుదల గురించి మరింత సమాచారం కావాలనుకుంటే, మీ బ్యాంక్‌ని సంప్రదించండి.

మీ ఖాతా నుండి డబ్బు బయటకు వెళ్లలేదని వారు నిర్ధారించగలరు. వారు తమ ఆథరైజేషన్ హోల్డ్ ప్రాసెస్ గురించి మరింత సమాచారం, మీ స్టేట్‌మెంట్ నుండి లైన్ ఐటెమ్ ఎప్పుడు కనిపించకుండా పోతుందనే దాని గురించి స్పష్టమైన టైం ఫ్రేమ్‌ని కూడా మీకు తెలుపగలరు.