నేను చెల్లింపు పద్ధతిని ఎలా అప్‌డేట్ చేయాలి లేదా తొలగించాలి?

ఇష్టపడే చెల్లింపు పద్ధతిని జోడించడం మరియు ఎంచుకోవడం మీరు రైడ్‌ను అభ్యర్థించడానికి అనుమతిస్తుంది. మీ దేశం మరియు నగరాన్ని బట్టి, మీరు క్రెడిట్ కార్డులు, నగదు లేదా PayPal ఖాతా వంటి చెల్లింపు పద్ధతులను జోడించవచ్చు. ఆర్డర్ డెలివరీ చేయబడినప్పుడు, మీరు ఎంచుకున్న చెల్లింపు పద్ధతికి ఛార్జీ విధించబడుతుంది.

చెల్లింపు పద్ధతిని జోడించండి

  1. “ఖాతా” పై, తరువాత “వాలెట్”పై తట్టండి.
  2. "చెల్లింపును జోడించు" పై తట్టండి.
  3. కార్డును స్కాన్ చేయడం, కార్డ్ సమాచారాన్ని మాన్యువల్‌గా నమోదు చేయడం లేదా ప్రత్యామ్నాయ చెల్లింపు రకాన్ని జోడించడం ద్వారా చెల్లింపు పద్ధతిని జోడించండి.

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను స్కాన్ చేయండి

  1. కార్డ్‌ను స్కాన్ చేయడానికి, కెమెరా ఐకాన్‌ను తట్టండి. యాప్ కోసం కెమెరాను ఉపయోగించడానికి మీ ఫోన్ అనుమతి అడగవచ్చు.
  2. మీ కార్డ్‌ను మీ ఫోన్ స్క్రీన్‌ మధ్యలో ఉంచండి, తద్వారా మొత్తం 4 మూలలు ఆకుపచ్చగా మెరుస్తాయి. సాధారణంగా అక్షరాలు మరియు అంకెలు పొదిగి ఉన్న కార్డులను స్కానింగ్ చేయడం తేలిక.
  3. కార్డు గడువు తేదీ, CVV నెంబర్ మరియు బిల్లింగ్ జిప్ లేదా పోస్టల్ కోడ్‌ను నమోదు చేయండి.
  4. "సేవ్ చేయి"పై తట్టండి.

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను మాన్యువల్‌గా జోడించండి

  1. మీ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
  2. గడువు తేదీ, CVV నంబర్ మరియు బిల్లింగ్ జిప్ లేదా పోస్టల్ కోడ్‌ను నమోదు చేయండి.
  3. "సేవ్ చేయి"పై తట్టండి.

కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి

మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ గడువు తేదీ, CCV నెంబర్ మరియు బిల్లింగ్ జిప్ లేదా పోస్టల్ కోడ్‌ను సవరించవచ్చు.

  1. "ఖాతా", ఆపై "వాలెట్"ను ఎంచుకోండి.
  2. మీరు అప్‌డేట్ చేయాలని అనుకునే చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మూడు చుక్కల ఐకాన్‌ను తట్టి, ఆపై “సవరించండి” మీద తట్టండి.
  4. మార్పులు చేసి, ఆపై "సేవ్ చేయి" పై తట్టండి.

ఒక డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌ను సవరించలేనప్పటికీ, మీ ఖాతా నుండి కార్డును తొలగించి, ఆపై కొత్త చెల్లింపు పద్ధతిగా మళ్ళీ జోడించవచ్చు.

చెల్లింపు పద్ధతిని తొలగించండి

మీ ఖాతాకు అన్ని సమయాల్లో కనీసం ఒక చెల్లింపు పద్ధతి ఉండాలి. మీరు మీ ఏకైక చెల్లింపు పద్ధతిని తొలగించాలని అనుకుంటే, మీరు ముందుగా ఒక కొత్తదాన్ని జోడించాల్సి ఉంటుంది.

  1. "ఖాతా", ఆపై "వాలెట్"ను ఎంచుకోండి.
  2. మీరు తొలగించాలని అనుకుంటున్న కార్డ్‌ను ఎంచుకోండి.
  3. ఎగువ కుడి మూలన ఉన్న మూడు చుక్కల ఐకాన్‌ను తట్టండి.
  4. "తొలగించండి" మీద తట్టి, ఆపై నిర్ధారించండి.