మీ ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్ తీయడం

పరికర యాజమాన్యాన్ని ధృవీకరించడానికి మేము మీ ఫోన్ నంబర్ స్క్రీన్‌షాట్‌ను అడగవచ్చు. మీ పరికరానికి వర్తించే క్రింది దశలను అనుసరించండి.

iOS:

  1. పరికరంలో "సెట్టింగ్స్" తెరవండి.
  2. క్రిందికి స్క్రోల్ చేసి, "ఫోన్" ఎంచుకోండి.
  3. "నా నంబర్" పక్కన జాబితా చేసిన నంబర్‌ను క్యాప్చర్ చేసే స్క్రీన్‌షాట్ తీసుకోండి.
  4. ఆ చిత్రం, మీ పరికరంలోని "ఫొటోస్" యాప్‌లో మిగిలిన చిత్రాలతో సేవ్ అవుతుంది.

Android: (మీ Android OS వెర్షన్‌ని బట్టి లొకేషన్ మారవచ్చు. అనేక వెర్షన్‌ల కోసం, మీరు ఈ క్రింది దశలను ఉపయోగించవచ్చు)

  1. "సెట్టింగ్స్" తెరవండి.
  2. క్రిందికి స్క్రోల్ చేసి, "ఫోన్ గురించి" లేదా "పరికరం గురించి" ఎంచుకోండి. ఫోన్ నంబర్ ఇక్కడ ప్రదర్శించకపోతే, “ఫోన్ గుర్తింపు” లేదా “స్టేటస్” ఆపై “SIM స్థితి” ఎంచుకోండి.
  3. పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ కీని ఒకే సమయంలో నొక్కడం ద్వారా మీ నంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి.