మీ నమ్మకానికి Uberలో మేం విలువనిస్తాం, మేం ఏ డేటాను సేకరిస్తాం, దానిని ఎలా ఉపయోగిస్తాం అనేది మీరు అర్థం చేసుకోవడానికి సాయపడాలని కోరుకుంటున్నాం. Uber వ్యక్తిగత డేటాను ఎలా సేకరిస్తుంది మరియు ఉపయోగిస్తుంది అనే విషయానికి సంబంధించిన వివరణాత్మక సమాచారం కోసం మీరు Uber గోప్యతా అవలోకనం లేదా గోప్యతా నోటీసును సందర్శించవచ్చు.
మీరు Uber ను ఉపయోగిస్తున్నప్పుడు మీ నుండి ఏ సమాచారాన్నిసేకరిస్తారు, పంచుకుంటారనే వివరాలను చూడటానికి, ఎంపిక చేసుకోవడానికి మీ కోసం మేం ఎంపికలను కూడా అందిస్తాం. ఈ డేటాను యాక్సెస్ చేసుకునేందుకు, మరింత అదనపు భద్రత కోసం మీరు 2-దశల ధృవీకరణను ఉపయోగించి మీ ఖాతాకు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.
మీరు తీసుకున్న ట్రిప్‌ల సంఖ్య, Uber Eats ఆర్డర్లు వంటి మీ ఖాతాకు సంబంధించిన సంగ్రహ సమాచారాన్ని చూడండి మరియు అన్వేషించండి.
ఈ ఎంపికతో, మీరు డౌన్లోడ్ చేయాల్సిన మీ డేటాకు సంబంధించిన ఫైల్‌ను అభ్యర్థించవచ్చు. మేము మీ అభ్యర్థనను స్వీకరించి, ఫైల్ డౌన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మేము మీకు ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా నోటిఫికేషన్ పంపుతాం.
మీరు మీ డేటా డౌన్‌లోడ్‌లో ఏముంది గురించి కూడా మరింత తెలుసుకోవచ్చు.
మీ డేటాను డౌన్లోడ్ చేయడం వలన Uber సిస్టమ్‌ల నుండి డేటా లేదా మీ ఖాతా తొలగించరు. మీరు మీ ఖాతాను తొలగించాలని అనుకుంటే, దయచేసి క్రింది లింక్‌ను ఉపయోగించండి.