Uber Eats కార్పొరేట్ వోచర్‌ల గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

నేను రైడ్‌ల కోసం నా Uber Eats వోచర్‌ను ఉపయోగించవచ్చా?
బిజినెస్ అనుమతిస్తే, మీ వోచర్ రైడ్‌లను కూడా కవర్ చేయవచ్చు. మీ వోచర్‌ను Uber Eats ఆర్డర్‌ల కోసం మాత్రమే ఉపయోగించవచ్చా లేదా ఆర్డర్‌లు మరియు రైడ్‌లు రెండింటి కోసం ఉపయోగించవచ్చా అనేది యాప్ మీకు తెలియజేస్తుంది.


నా Uber Eats వోచర్ నా ప్రొఫైల్‌కు వర్తించడం లేదు, నేను ఏమి చేయాలి?
వోచర్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు మీరు మీ వ్యక్తిగత ప్రొఫైల్ లేదా నిర్వహించని బిజినెస్ ప్రొఫైల్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. Uber Eats వోచర్‌లను వ్యక్తిగత ప్రొఫైల్ లేదా నిర్వహించని బిజినెస్ ప్రొఫైల్‌తో మాత్రమే ఉపయోగించగలరు.


టిప్‌ల కోసం నేను నా Uber Eats వోచర్‌లను ఉపయోగించవచ్చా?
బిజినెస్ అనుమతిస్తే వోచర్ టిప్‌లలో కొంత శాతాన్ని కవర్ చేస్తుంది (వోచర్ ఎంత కవర్ చేస్తుందో యాప్ మీకు తెలియజేస్తుంది). వోచర్ మొత్తాన్ని మించిన ఏదైనా ఆర్డర్ లేదా టిప్ మొత్తం మీ వ్యక్తిగత చెల్లింపు పద్ధతికి ఛార్జ్ చేయబడుతుంది.


నేను నా మీల్ వోచర్ (కొన్ని దేశాలలో వర్తిస్తుంది) మరియు Uber Eats వోచర్‌లను ఒకే ఆర్డర్‌లో ఉపయోగించవచ్చా?
లేదు, మీరు మీల్ వోచర్ మరియు Uber Eats వోచర్‌లను ఒకే ఆర్డర్‌కు వర్తింపజేయలేరు.

నేను వోచర్ పరిమితులను ఎక్కడ చూడగలను?
వోచర్‌పై పరిమితులను చూడండి:
1. Uber Eats యాప్‌ను తెరవండి.
2. ప్రొఫైల్ చిహ్నాన్ని, ఆపై "ఖాతా"ను ఎంచుకోండి.
3. "వాలెట్" ఎంచుకుని, "వోచర్లు" వరకు క్రిందికి స్క్రోల్ చేయండి.
4 పరిమితులు మరియు వివరాలను చూడటానికి వోచర్‌ను తట్టండి.

మీరు యాప్‌లో లేదా ubereats.comలో ఆర్డర్ చేసేటప్పుడు మీ కార్ట్‌లోని వోచర్ వివరాలను కూడా చూడవచ్చు.

ఏ రకమైన పరిమితులు ఉన్నాయి?
మీ వద్ద ఉన్న వోచర్ రకాన్ని బట్టి పరిమితులు మారవచ్చు. సాధారణ పరిమితులలో ఇవి ఉండవచ్చు: డెలివరీ స్థానం, మర్చంట్ రకాలు లేదా వస్తువు స్థాయి పరిమితులు (అంటే మద్యం, సిగరెట్లు, కిరాణా సామాగ్రి మొదలైనవి). మీ వోచర్‌కు ఎలాంటి పరిమితులు ఉన్నాయో ధృవీకరించడానికి, ఎగువన ఉన్న సూచనలను చూడండి.


నా యాప్‌లో Eats వోచర్‌లను చూడటంలో నాకు సమస్య ఉంది, నేను ఏమి చేయాలి?
Uber Eats యాప్‌లో Uber Eats వోచర్‌లను చూడటానికి, మీ వద్ద యాప్ తాజా వెర్షన్ ఉందని నిర్ధారించుకోండి. మీ యాప్‌ను అప్‌డేట్ చేయండి లేదా దానిని అన్‌ఇన్‌స్టాల్ చేసి, యాప్ స్టోర్ లేదా Google ప్లే స్టోర్ నుండి మళ్ళీ ఇన్‌స్టాల్ చేయండి. మీ యాప్‌ అప్‌డేటెడ్‌గానే ఉన్నట్లయితే ,యాప్ ఫోర్స్ స్టాప్ చేసి, తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించండి.