ప్యాకేజీ డెలివరీ సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు

Uber కనెక్ట్ అంటే ఏమిటి?

Uber కనెక్ట్ అనేది నిర్ధారిత డ్రాప్-ఆఫ్ లొకేషన్‌లో వేచి ఉన్న వ్యక్తి వద్దకు మీ ప్యాకేజీ(ల)ని రవాణా చేయడంలో మీకు సహాయపడటానికి డ్రైవర్‌ను అభ్యర్థించడానికి మిమ్మల్ని అనుమతించే ఒక ఎంపిక.

నేను ఏమి పంపగలను?

వాహనం ద్వారా డెలివరీ చేసే ప్యాకేజీల కోసం, మీరు దిగువ పేర్కొన్న చిన్న లేదా ఒక మోస్తరు పరిమాణంలో ఉండే ప్యాకేజీలను పంపవచ్చు:

  • నిషేధించిన ఐటెమ్‌లను కలిగి ఉండకూడదు (నిషేధిత ఐటెమ్‌‌ల జాబితాను దిగువన చూడండి)
  • అన్నీ కలిపి గరిష్టంగా 30 పౌండ్‌ల బరువు ఉండాలి
  • మధ్య-పరిమాణ వాహనం ట్రంక్‌లో సౌకర్యవంతంగా సరిపోవాలి
  • మూసివేయబడి, సురక్షితంగా సీల్ చేయబడి, కర్బ్‌సైడ్ లేదా డోర్ పికప్ కోసం సిద్ధంగా ఉండాలి
  • మొత్తం విలువ $100 USD కంటే ఎక్కువ ఉండకూడదు

బైక్ లేదా స్కూటర్ ద్వారా అందించే ప్యాకేజీల కోసం, మీరు దిగువ పేర్కొన్న చిన్న లేదా ఒక మాదిరి ప్యాకేజీలను పంపవచ్చు:

  • నిషేధించిన ఐటెమ్‌లను కలిగి ఉండకూడదు (నిషేధిత ఐటెమ్‌‌ల జాబితాను దిగువన చూడండి)
  • అన్నీ కలిపి గరిష్టంగా 15 పౌండ్‌ల బరువు ఉండాలి
  • బ్యాక్‌ప్యాక్‌లో సౌకర్యవంతంగా అమరాలి
  • మూసివేయబడి, సురక్షితంగా సీల్ చేయబడి, కర్బ్‌సైడ్ లేదా డోర్ పికప్ కోసం సిద్ధంగా ఉండాలి
  • మొత్తం విలువ $100 USD కంటే ఎక్కువ ఉండకూడదు

మీ ప్యాకేజీలో నిషేధిత ఐటెమ్ ఉన్నాలేదా పైన ఉన్న పరిమితులను పాటించకపోయినా, డ్రైవర్ మీ అభ్యర్థనను రద్దు చేయవచ్చు.

డెలివరీని ఎలా అభ్యర్థించాలి

  1. మీ Uber యాప్ "ఎక్కడికి?" విభాగంలో ప్యాకేజీ గమ్యాన్ని నమోదు చేయండి మరియు పికప్ లొకేషన్ సరైనదని నిర్ధారించుకోండి. డెలివరీని అభ్యర్థించిన తర్వాత మీరు పికప్ లేదా డ్రాప్‌ఆఫ్ చిరునామాను మార్చలేరు.
  2. వాహన ఎంపికలను స్క్రోల్ చేయండి మరియు "కనెక్ట్ చేయి"ని ఎంచుకోండి.
  3. మీ చెల్లింపు పద్ధతిని సమీక్షించి, "తదుపరి"పై తట్టండి.
  4. ప్యాకేజీ డెలివరీ నియమనిబంధనలను అంగీకరించండి మరియు మీ ప్యాకేజీలో నిషేధిత ఐటెమ్‌లు ఏవీ లేవని నిర్ధారించండి.
  5. గ్రహీత పేరు మరియు మీ డ్రైవర్ కోసం ఏదైనా ప్రత్యేక డెలివరీ సూచనలను కోరుతూ మీరు Uber యాప్‌లో అందుకునే సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వండి.
  6. ఎంచుకున్న పికప్/డెలివరీ పద్ధతిని బట్టి డోర్ లేదా కర్బ్‌సైడ్ వద్ద డ్రైవర్‌ను కలవండి మరియు వాహనంలోకి ప్యాకేజీని లోడ్ చేయండి.
  7. ఎంచుకున్న పికప్/డెలివరీ పద్ధతిని బట్టి డోర్ లేదా కర్బ్‌సైడ్ వద్ద డ్రైవర్‌ను కలవమని మరియు డ్రైవర్ వాహనం నుండి ప్యాకేజీని తీసుకోమని గ్రహీతకు సూచించండి.

గమనిక: మీరు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ప్యాకేజీలను పంపవచ్చు. ఈ ఫీచర్ అభ్యర్థించిన ట్రిప్ కార్డ్ దిగువన ఉంది మరియు ఒక వినియోగదారు కోసం అన్ని యాక్టివ్ ట్రిప్‌లను ప్రదర్శించే కార్యాచరణ హబ్ కూడా ఉంది. మీ ప్యాకేజీ డెలివరీని అదే మార్గంలో ఉన్న ఇతర ప్యాకేజీలతో తక్కువ ఛార్జీతో బ్యాచ్ చేసే ఎంపికను మీరు చూడవచ్చు.

గమనిక: ఎంచుకున్న పికప్/డెలివరీ పద్ధతిని బట్టి డోర్ లేదా కర్బ్‌సైడ్ వద్ద డ్రైవర్‌ను కలవడానికి ప్యాకేజీ గ్రహీత అందుబాటులో ఉండాలి. గ్రహీత డోర్ వద్ద ప్యాకేజీని వదిలివేయమని మీరు డ్రైవర్‌ను అడగాలనుకుంటే, మీరు ఆ సూచనలను ప్రత్యేక డెలివరీ సూచనలలో భాగంగా లేదా యాప్‌లో డ్రైవర్‌కు సందేశంలో తప్పనిసరిగా చేర్చాలి.

డెలివరీ సమయంలో మీ ప్యాకేజీ దెబ్బతింటే, మీరు డెలివరీ ఖర్చు రీఫండ్‌ను కోరుకుంటే, డెలివరీ తేదీ తర్వాత మూడు వ్యాపార దినాలలో మీరు ఫోటో మరియు నష్టానికి సంబంధించిన వివరణను సబ్మిట్ చేయాలి.

Uber ప్యాకేజీల కోసం బీమాను నిర్వహించదు. పూర్తి వివరాల కోసం దయచేసి నియమనిబంధనలను చూడండి. నియమనిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసు లేకుండానే మీ ఖాతాను డీయాక్టివేట్ చేయవచ్చు.

నేను ఎవరికైనా సర్‌ప్రైజ్‌గా ఒక ప్యాకేజీని పంపవచ్చా?

వారు వాహనం నుండి ప్యాకేజీని తీసుకునేందుకు, ఎంచుకున్న పికప్/డెలివరీ పద్ధతిని బట్టి డ్రైవర్‌ను డోర్ వద్ద లేదా కర్బ్‌సైడ్ వద్ద కలుసుకోవాలని మీరు గ్రహీతకు సూచించాలని మేము సిఫారసు చేస్తున్నాము.

మీరు ఎవరికైనా సర్‌ప్రైజ్‌గా ప్యాకేజీని పంపితే, గ్రహీత తలుపు వద్ద ప్యాకేజీని ఉంచమని Uber యాప్ సందేశ విభాగంలో మీరు డ్రైవర్‌కు స్పష్టంగా సూచించాల్సి ఉంటుంది. డ్రైవర్ ఎల్లప్పుడూ ఈ అభ్యర్థనను తిరస్కరించవచ్చు.