Uber యాప్ ద్వారా రైడ్‌ను ఎలా అభ్యర్థించాలో ఇక్కడ ఉంది:
- మీ యాప్‌ను తెరిచి "ఎక్కడికి వెళ్లాలి?" అనే ఫీల్డ్‌లో మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి.
- మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న వాహన ఎంపికలను అన్నింటిని చూడటానికి పైకి స్వైప్ చేయండి. మీ రైడ్ కోసం ఎంచుకోవడానికి ఒకదాన్ని తట్టండి, ఆ తర్వాత "Uber X ఎంచుకోండి"ని (బటన్ మీ వాహన ఎంపిక అవుతుంది) తట్టండి.
- మీ పికప్ లొకేషన్‌ను నిర్ధారించమని మిమ్మల్ని అడగవచ్చు. అది జరిగితే, మ్యాప్‌పై పిన్ని జరపండి లేదా లొకేషన్ల జాబితా నుండి ఎంచుకోండి. మీ అభ్యర్థనను ఆ ప్రాంతంలోని అర్హతగల డ్రైవర్లకు పంపడం కోసం "పికప్ నిర్ధారించండి"ని తట్టండి.
- మీ పికప్‌ని నిర్ధారించమని మిమ్మల్ని అడగకుంటే, ఆ ప్రాంతంలోని అర్హత కలిగిన డ్రైవర్లకు మీ అభ్యర్థనను పంపడానికి “UberXని నిర్ధారించండి” (బటన్ మీ వాహనం ఎంపిక అవుతుంది) తట్టండి.
- అర్హత కలిగిన డ్రైవర్‌తో మ్యాచ్ చేయడానికి అంచనా సమయాన్ని, మీరు చూస్తారు. మీరు ఎంచుకున్న రైడ్ రకానికి డ్రైవర్లు అందుబాటులో లేకుంటే, యాప్ సమీపంలో ఉన్న డ్రైవర్లతో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ రైడ్ రకాన్ని సూచిస్తుంది.
- డ్రైవర్ మీ అభ్యర్థనను అంగీకరించిన తర్వాత, మ్యాప్‌లో మీరు వారి లొకేషన్ మరియు రావడానికి పట్టే అంచనా సమయం కనిపిస్తాయి.
మీ అభ్యర్థన కోసం డ్రైవర్లు అందుబాటులో లేకుంటే యాప్ మీకు తెలియజేస్తుంది.
మీ డ్రైవర్ మీ పికప్ లొకేషన్‌కు దగ్గరగా ఉన్నప్పుడు Uber మీకు నోటిఫికేషన్లను పంపుతుంది.
కొన్ని నగరాల్లో, మీరు పలు స్టాప్‌లతో కూడిన రైడ్‌ను అభ్యర్థించవచ్చు.
రైడ్లను త్వరగా అభ్యర్థించడానికి మీరు మీకు ఇష్టమైన లొకేషన్లను కూడా సేవ్ చేసుకోవచ్చు:
IOSలో సేవ్ చేసిన ప్రదేశాలను జోడించడం
Androidలో సేవ్ చేసిన ప్రదేశాలు జోడించడం