ప్యాకేజీ డెలివరీ సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు

Uber కనెక్ట్ అంటే ఏమిటి?

నిర్ధారిత డ్రాప్ఆఫ్ లొకేషన్‌లో వేచి ఉన్న వ్యక్తికి మీ ప్యాకేజీలను రవాణా చేయడానికి డ్రైవర్‌ను అభ్యర్థించడానికి Uber కనెక్ట్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

నేను ఏమి పంపగలను?

వాహనం ద్వారా అందించే ప్యాకేజీల కోసం, మీరు దిగువ పేర్కొన్న చిన్న లేదా ఒక మాదిరి ప్యాకేజీలను పంపవచ్చు:

  • నిషేధిత వస్తువులు ఏవీ లేవు (నిషేధిత వస్తువుల జాబితాను దిగువన చూడండి)
  • డెలివరీ కోసం బరువు లేదా విలువ పరిమితులను మించరాదు
  • మిడ్-సైజు వాహనం ట్రంక్‌లో సౌకర్యవంతంగా ఫిట్ అవ్వాలి
  • మూసివేసి, సురక్షితంగా సీల్ చేసి, పికప్ కోసం సిద్ధంగా ఉండాలి

బైక్ లేదా స్కూటర్ ద్వారా అందించే ప్యాకేజీల కోసం, మీరు దిగువ పేర్కొన్న చిన్న లేదా ఒక మాదిరి ప్యాకేజీలను పంపవచ్చు:

  • నిషేధిత వస్తువులు ఏవీ లేవు (నిషేధిత వస్తువుల జాబితాను దిగువన చూడండి)
  • గరిష్ట పూర్తి బరువు 15 పౌండ్‌లు మరియు గరిష్ట పూర్తి విలువ $100 ఉండాలి
  • వీపుకు తగిలించుకొనే బ్యాక్‌ప్యాక్‌లో సౌకర్యవంతంగా అమరాలి
  • మూసివేసి, సురక్షితంగా సీల్ చేసి, పికప్ కోసం సిద్ధంగా ఉండాలి

నిషేధించిన వస్తువులు

మీ కాంట్రాక్ట్‌లో పేర్కొనకపోతే తప్ప, నిషేధించిన అంశాల్లో వీటితో సహా, అయితే వీటికే పరిమితం కాకుండా ఉంటాయి:

  • మద్యం
  • జంతువులు
  • ఆయుధాలు
  • పెళుసుగా ఉండే వస్తువులు
  • డబ్బు/గిఫ్ట్ కార్డ్‌లు/మొదలైనవి.
  • వినోద మందులు

మీ ప్యాకేజీలో నిషేధిత వస్తువు ఉన్నా లేదా పైన ఉన్న పరిమితులను పాటించకపోతే, డ్రైవర్ మీ అభ్యర్థనను రద్దు చేయవచ్చు.

డెలివరీని ఎలా అభ్యర్థించాలి

డెలివరీని అభ్యర్థించడానికి:

  1. Uber యాప్‌లో ప్యాకేజీ ఐకాన్‌ని తట్టండి.
  2. "ప్యాకేజీని పంపండి" లేదా "ప్యాకేజీని స్వీకరించండి" ఎంచుకుని, పంపినవారు లేదా గ్రహీతల సమాచారాన్ని నమోదు చేయండి. ఈ సమాచారాన్ని ఎల్లప్పుడూ పూరించాలని గుర్తుంచుకోండి, తద్వారా మీరు డెలివరీ పిన్‌ను యాక్టివేట్ చేయవచ్చు.
  3. "కనెక్ట్ ఎంచుకోండి" తట్టండి.
  4. ప్యాకేజీ మార్గదర్శకాలను సమీక్షించి, "అర్థమైంది" ఎంచుకోండి.
  5. డెలివరీ వివరాలను సమీక్షించండి, డెలివరీ ఎంపికలను ఎంచుకోండి మరియు ప్రత్యేక సూచనలను జోడించండి.
  6. మీ డెలివరీ అభ్యర్థనను నిర్ధారించండి.

డెలివరీని అభ్యర్థించిన తర్వాత మీరు పికప్ లేదా డ్రాప్‌ ఆఫ్ చిరునామాను మార్చలేరు.

డెలివరీ పిన్ ప్యాకేజీ డెలివరీ చేసినట్లుగా నిర్ధారించడానికి సహాయపడే ఒక మార్గం, కానీ పిన్‌ను సేకరించడం సాధ్యం కాని సమయాలు కూడా కొన్నిసార్లు ఉండవచ్చు. మీరు డెలివరీ పిన్‌ను యాక్టివేట్ చేసినట్లయితే, ఇది మీ యాప్‌లో కనిపిస్తుంది, వస్తువును స్వీకరించే వ్యక్తితో పంచుకుంటారు. స్వీకరించే వ్యక్తి డెలివరీని తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి మరియు డ్రైవర్‌తో పిన్‌ను పంచుకోవాలి

డెలివరీ సమయంలో మీ ప్యాకేజీ దెబ్బతింటే మరియు మీరు డెలివరీ ఖర్చు రీఫండ్ కోరుకుంటే, డెలివరీ తేదీ తర్వాత మూడు వ్యాపార దినాలలో మీరు ఫోటో మరియు నష్టానికి సంబంధించిన వివరణ సమర్పించాలి.

Uber ప్యాకేజీల కోసం బీమాను నిర్వహించదు.

పూర్తి వివరాల కోసం దయచేసి నిబంధనలు మరియు షరతులు చూడండి. నిబంధనలు మరియు షరతులను ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసు లేకుండానే మీ ఖాతాని డీయాక్టివేట్ చేయవచ్చు.

నేను ఎవరికైనా సర్‌ప్రైజ్‌గా ఒక ప్యాకేజీని పంపవచ్చా?

డెలివరీ గ్రహీతకు తెలియజేయాలని మేము సిఫార్సు చేస్తున్నాం, తద్వారా వారు వాహనం నుండి ప్యాకేజీని తిరిగి పొందడానికి డ్రైవర్‌ను కర్బ్ వద్ద కలుసుకోవచ్చు.

మీరు ఎవరికైనా సర్‌ప్రైజ్‌గా ప్యాకేజీని పంపితే, గ్రహీత తలుపు వద్ద ప్యాకేజీని ఉంచమని Uber యాప్ సందేశ విభాగంలో మీరు డ్రైవర్‌కు స్పష్టంగా సూచించాల్సి ఉంటుంది. డ్రైవర్ ఎల్లప్పుడూ ఈ అభ్యర్థనను తిరస్కరించవచ్చు.