డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వడం

రేటింగ్స్ మమ్మల్ని రైడర్‌లు మరియు డ్రైవర్‌లు ఇద్దరికీ సానుకూల అనుభవం ఉంటుందని నిర్ధారించేలా చేస్తాయి, అందువల్ల మేం వాటిని ముఖ్యమైనవిగా పరిగణిస్తాం. తక్కువ రేటింగ్స్‌ ఉన్న డ్రైవర్‌లు యాప్‌కు యాక్సెస్‌ను కోల్పోవచ్చు.

డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వడానికి, ట్రిప్ చివరిలో యాప్‌లోని ప్రాంప్ట్‌లను అనుసరించండి. మీకు ఇమెయిల్ చేసిన రసీదు కింద భాగంలో కూడా మీ డ్రైవర్‌కు రేటింగ్‌ ఇవ్వమని మిమ్మల్ని కోరతారు.

మీరు ట్రిప్‌లో ఉన్నప్పుడు కూడా డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వగలరు (మీ లొకేషన్‌‌పై ఆధారపడి ఉంటుంది):

  1. యాప్‌ను తెరవండి.
  2. ప్రధాన స్క్రీన్‌లో, ట్రిప్ వివరాలను విస్తరించడానికి వైట్ స్క్రీన్‌ మీద తట్టండి.
  3. “మీ రైడ్ ఎలా ఉంది?” పక్కన ఉండే “రేట్ లేదా టిప్” మీద తట్టండి.
  4. మీరు మీ డ్రైవర్‌ను రేట్ చేయాలని అనుకునే స్టార్స్ సంఖ్యను (1-5) ఎంచుకోండి.
  5. మీకు ఇష్టమైతే టిప్ జోడించి, "సేవ్ చేయండి" ఎంచుకోండి.

మీరు డ్రైవర్‌కు రేటింగ్ ఇస్తుంటే:

  • 5 స్టార్స్, వారిని అభినందించే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ట్రిప్‌తో నిర్దిష్టంగా ఏదైనా సమస్య ఉంటే తప్ప చాలా మంది రైడర్‌లు 5-స్టార్ రేటింగ్ ఇస్తారు.
  • 5 స్టార్స్ కన్నా తక్కువ, సాధారణ సమస్యల జాబితా నుండి ట్రిప్ లేదా డ్రైవర్ గురించి నిర్దిష్ట అభిప్రాయాన్ని అందించమని మిమ్మల్ని కోరతారు. 1-స్టార్ రేటింగ్ సాధారణంగా డ్రైవర్‌తో తీవ్రమైన సమస్య ఉందని అర్థం.

ట్రిప్ ధర, యాప్ సమస్యలు లేదా అసౌకర్యవంతమైన పూల్ మ్యాచ్‌లు వంటి సమస్యలు డ్రైవర్ తప్పు కాదు, కాబట్టి వాటి మొత్తం రేటింగ్‌లో లెక్కించరు.

మీరు ట్రిప్ యొక్క 30 రోజుల్లో డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వవచ్చు. మీరు ఇచ్చే రేటింగ్‌ను డ్రైవర్ ఎప్పటికీ చూడలేరు.